ఆ శాఖల పనితీరు దారుణం
● లక్ష్యాలకు చేరుకోలేకపోతున్న రిజిస్ట్రేషన్, గనులు, ఎకై ్సజ్ శాఖలు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అసంతృప్తి
విజయనగరం అర్బన్: జిల్లాలో రిజిస్ట్రేషన్, గనులు, ఎకై ్సజ్ శాఖల పనితీరు దారుణంగా ఉంది.. ఆదాయార్జనలో లక్ష్యాలు చేరుకోలేకపోతున్నాయని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయ సాధన లోపాలపై అసహ నం వ్యక్తంచేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది లక్ష్యం రూ.345 కోట్లు కాగా గతేడాది డిసెంబర్ నాటికి కేవలం రూ.249 కోట్లు మాత్రమే సమకూరాయని, సుమారు రూ.100 కోట్లు లోటు ఉందన్నారు. కొత్తవలస, తెర్లాం, బొబ్బిలి సబ్ రిజిస్ట్రా ర్ పరిధిలో అమ్మకాలు భారీగా తగ్గడమే ఇందుకు కారణమని జిల్లా రిజిస్ట్రార్ టి.ఉపేంద్రరావు వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లక్ష్యం చేరకుంటామని తెలిపారు. గనుల శాఖ నుంచి ఈ ఏడాది మొత్తం లక్ష్యం రూ.124 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.61కోట్లు మాత్రమే సమకూరాయని, 50 శాతం కంటే తక్కువేనని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని గనులలీజు గడువు ముగియడమే కారణమని డిప్యూటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. త్వరలో లీజులు పునరుద్ధరించి ఆదాయం పెంచాలని కలెక్టర్ తెలిపారు. ఎకై ్సజ్‌శాఖ లక్ష్యం రూ.1,373 కోట్లు కాగా, గతేడాది డిసెంబర్ నాటికి రూ.1,115 కోట్లు మాత్రమే వచ్చాయని జిల్లా ప్రొబేషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.ఎస్.దొర తెలిపారు.
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహ దారుల విస్తరణ, తోటపల్లి జలాశయం, తారకరామ తీర్థసాగర్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి ముఖ్యప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. గరివిడి ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఫుడ్‌పార్క్, రెల్లి గ్రామంలో ప్రతిపాదిత పోలీస్ శిక్షణ కేంద్రం కోసం భూసేకరణ అగ్రిమెంట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కోసం దశలవారీగా భూసేకరణ, పునరావాసం, పరిహారం వివరాలు సిద్ధంచేయాలని సంబంధిత డివిజనల్ రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో మురళీ, ఆర్డీఓలు దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, రైల్వే, భూసేకరణ, పరిశ్రమల శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.


