జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని
విజయనగరం అర్బన్: న్యూఢిల్లీలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు రాష్ట్రం తరఫున పోటీపడే జట్టులో పట్టణంలోని దాసన్నపేటకు చెందిన ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థిని ఎన్.లావణ్య ఎంపికై ంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.రమణమ్మ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 38 కేజీల విభాగంలో లావణ్య బంగారు పతకం సాధించి ఈ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లావణ్యను ప్రధానోపాధ్యాయురాలితో పా టు సీనియర్ ఉపాధ్యాయులు ఈ.రామునాయుడు, వ్యాయామ ఉపాధ్యాయురాలు పి.ప్రమీల, బి.ఆషారాణి, సీహెచ్‌వీ రత్నం అభినందించారు.


