ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
చీపురుపల్లిరూరల్ (గరివిడి):
గరివిడిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో సోమవారం అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరగనున్న 14వ విశ్వవిద్యాలయ క్రీడాసాంస్కతిక పోటీల్లో తలపడేందుకు వివిధ కళాశాలల నుంచి 530 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు వివిధ కళాశాలల విద్యార్థులు రంగు రంగుల వస్త్రధారణలతో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే జానపద నృత్యాలతో అలరించారు. క్రీడా, సాంస్కృతిక పోటీల క్రీడా జ్యోతిని ఎచ్చెర్లకు చెందిన ఏపీ స్పెషల్ పోలీస్, ఫస్ట్ బెటాలియిన్ కమాండెంట్ సీహెచ్‌వీఎస్ పద్మనాభరాజు, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ డా.వి.వైకుంఠరావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ హెడ్ డా.బి.జయచంద్ర వెలిగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భవిష్యత్‌కు దారిచూపిస్తాయన్నారు.
గరివిడి వెటర్నరీ కళాశాలలో
ప్రారంభమైన క్రీడా సాంస్కృతిక
సమ్మేళనం
5 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న 14వ క్రీడా సాంస్కృతిక పోటీలు
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...


