ఘనంగా పెద పోలమాంబ తొలేళ్లు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని సోమవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. చదురుగుడిలో పోలమాంబ అమ్మవారి సన్నిధిలో ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్‌భోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, మాజీట్రస్ట్‌బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, కుప్పిలి, కరణం, రెవిన్నాయుడు, జన్నివారి కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు పెదపోలమాంబ అమ్మవారి ఘటా లకు వెండిపూతను పట్టించి అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని, అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాలకు గ్రామంలో తిరువీధి నిర్వహించారు. మంగళవారం పెదపోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవం నిర్వహిస్తారు.
ఘనంగా పెద పోలమాంబ తొలేళ్లు


