క్రీడలతో స్నేహభావం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహభావం

Jan 6 2026 8:00 AM | Updated on Jan 6 2026 8:00 AM

క్రీడలతో స్నేహభావం

క్రీడలతో స్నేహభావం

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌

37వ క్రీడాపోటీలు ప్రారంభం

డెంకాడ: శారీరక, మానసిక సామర్థ్యంతో పాటు స్నేహభావం పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు చింతలవలస ఏపీఎస్పీ 5 వ బెటాలియన్‌ లో 37వ క్రీడా పోటీలను ఆయన బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల వల్ల పోలీసుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. క్రీడల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులే కాకుండా వారి పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కలెక్టర్‌ ముందుగా కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 9 బెటాలియన్‌ బృందాలు మధ్యలో బ్యాండు మేళా వాయిద్యాలతో కన్నుల పండువగా కవాతు ప్రదర్శన నిర్వహించాయి. పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సురేష్‌, సత్యారావు, దివాకర్‌లకు కలెక్టర్‌ మెడల్స్‌, ప్రశంసా పత్రాలను బహూకరించారు. కార్యక్రమంలో బెటా లియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ రాజారెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్లు ప్రభాకర్‌, రమణమూర్తి, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, టీం కెప్టెన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, కు టుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 11 వ్యక్తిగత, సామూహిక క్రీడా పోటీలు నిర్వహించగా, సుమారు 207 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు.

80 లీటర్ల సారాతో ఇద్దరి అరెస్ట్‌

కురుపాం: సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలంలోని పాత్రునివలస గ్రామ పరిధిలో సారా రవాణా చేస్తున్న చినమేరంగి గ్రామానికి చెందిన బొమ్మాళి అరుణ్‌ కుమార్‌ వద్ద 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సారా రవాణాకు సహకరించిన బొత్స అఖిల్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. సారా తయారీకి ముడిసరుకు సరఫరా చేసిన ఒడిశాకు చెందిన మీసాల తిరుపతి రావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్‌ ఎస్సై రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

పూసపాటిరేగ: మండలంలోని సీహెచ్‌ అగ్రహారం సమీపంలో గల మేట్రిక్స్‌ కంపెనీ వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యాన్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..విజయవాడ నుంచి టెక్కలికి సామగ్రితో వెళ్తున్న వ్యాన్‌ను సీహెచ్‌ అగ్రహారంలోని మేట్రిక్స్‌ కంపెనీ సమీపంలో జాతీయరహదారిపై పక్కకు ఆపి కాలకృత్యాలు తీర్చుకోవడానికి డ్రైవర్‌ గురజాపు నగేష్‌ (30) రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈనెల 4వతేదీన ఉదయం విజయవాడలో బయలుదేరిన వ్యాన్‌ 5 వతేదీ ఉదయం 7 గంటలకు పూసపాటిరేగ మండలం సీహెచ్‌ అగ్రహారం వద్దకు వచ్చే సరికి ఆపిన డ్రైవర్‌ రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుడి భార్య గురజాపు భవాని తెలిపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి

విజయనగరం క్రైమ్‌: విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్మపురిలో సోమవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి రూరల్‌ ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీజీఆర్‌ కాలేజీ నుంచి ముగ్గురు యువకులు బైక్‌పై విజయనగరం వస్తున్నారు. విజయనగరం నుంచి జావా వెహికల్‌పై మరో యువకుడు ధర్మపురి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మపురి దగ్గర రెండు బైక్‌లు ఢీ కొనగా స్పాట్‌లోనే బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు దుర్మరణం చెందాడు. ఆస్పత్రిలో మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతుండగా ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement