కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

Jan 5 2026 7:29 AM | Updated on Jan 5 2026 7:29 AM

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

విజయనగరం క్రైమ్‌: ఆర్‌మ్డ్‌డ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ కుటుంబాన్ని సహచర సిబ్బంది ఆర్థికంగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ 2000 బ్యాచ్‌ కు చెందిన కానిస్టేబుల్‌ పి.శ్రీనివాసరావు అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాచ్‌ మేట్స్‌ పోగు చేసిన రూ.81వేల నగదును ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ తన చాంబర్‌లో కానిస్టేబుల్‌ భార్య పి.లక్ష్మికి ఆదివారం అందజేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాచ్‌ మేట్స్‌ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనించదగ్గ విషయమని ఎస్పీ ప్రశంసించారు. అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించ లేకపోతున్న కానిస్టేబుల్‌ కుటుంబం కొంతకాలంగా ఆర్థిగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తోటి బ్యాచ్‌ మేట్స్‌ శ్రీనివాసరావు పరిస్థితిని గమనించి, ఆర్థికంగా ఆదుకునేందుకు కొంత నగదు సమకూర్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.గోపాల నాయుడు, 2000 ఏఆర్‌ బ్యాచ్‌ మేట్స్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement