ముగిసిన స్టెప్‌కాన్ సదస్సు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్టెప్‌కాన్–2026 జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ స్టెప్‌కాన్ కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదని, దానికి బహుముఖ ప్రాధాన్యత చేకూరిందన్నారు. నూతన సాంకేతిక విప్లవం ద్వారా కొత్త రకాలైన ఉద్యోగ అవకాశాలు సృష్టించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి జ్ఞానంతో పాటు నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. ప్రతి రంగంలో విభిన్నంగా ఆలోచించడం ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా సెలబ్రిటీలుగా మారవచ్చునని, విద్యార్థులు ఆ దిశగా ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులందరికీ విశేషమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనడానికి రెండు రోజులుగా నిర్వహించిన సదస్సులో ప్రదర్శనలే నిదర్శనమని అన్నారు. ఈ మెగా ఈవెంట్‌లో దేశం నలుమూలల నుంచి మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలు ప్రదర్శించారన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన స్టెప్‌కాన్–2026 సదస్సులో 87 మంది సాంకేతిక పత్రాలు సమర్పించగా.. 509 మంది విద్యార్థులు వివిధ వర్క్‌షాప్‌లో, 107 మంది ప్రాజెక్టు ఎగ్జిబిషన్ పోటీలోను, 67 మంది స్టార్ట్ ఆఫ్ ఐడియాస్ పోటీలో, 54 మంది జీపీఎల్ వంటి సెంట్రల్ పోటీలతో పాటు వివిద అంశాల్లో, ఏ1 మారథాన్‌లో 136, వెబ్‌సాగాలో 179 మంది, బాటిల్ బాట్స్‌లో 90, డ్రోన్ రైడర్స్ చాంపియన్‌షిప్‌లో 58, సీఏడీ కంబాట్‌లో 54, స్ట్రూక్టో సీ్త్రకేర్‌లో 108 మంది పాల్గొన్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. సదస్సులో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.సతీష్ , కో కన్వీనర్ బీవీ సురేష్, నందిని తదితరులు పాల్గొన్నారు.


