● పట్టణాల్లోని రేషన్ లబ్ధిదారులకే గోధుమపిండి పంపిణీ ●
విజయనగరం ఫోర్ట్:
చంద్రబాబు సర్కార్.. గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల వివక్ష చూపుతోంది. విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలుచేస్తోంది. పట్ణణ ప్రజలను ఒకలా, గ్రామీణ ప్రాంత ప్రజలను మరోలా చూస్తోంది. పట్టణాల్లో నివసిస్తున్న రేషన్ లబ్ధిదారులకు మాత్రమే గోధుమ పిండి సరఫరా చేస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించడంపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే లబ్ధిదారులు అధికం. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా అక్కడే ఎక్కువ. పల్లె ప్రజలకు కాకుండా కేవలం పట్టణంలో ఉండేవారికి మాత్రమే గోధుమ పిండి అందజేస్తామని ప్రకటించడాన్ని తూర్పూరబెడుతున్నారు. అన్ని పథకాల్లోనూ కోతవేస్తున్న ప్రభుత్వం.. చివరకు రేషన్ సరఫరాలోనూ కోతపెడుతోందని విమర్శిస్తున్నారు.
● జిల్లాలో 5.71 లక్షల రైస్ కార్డులు...
విజయనగరం జిల్లాలో 5.71 లక్షల మంది రైస్ కార్డుదారులు ఉన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన ఏ సరుకులైనా కార్డుదారులందరికీ ఒకే విధానంలో పంపిణీ చేయాలి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విజయనగరం అర్బన్‌లో ఉన్న వారికి మాత్రమే గోధుమ పిండి పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాలోని కార్డుదారులందరికీ కేజీ చొప్పున 571 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి అవసరం కాగా, కేవలం విజయనగరం అర్బన్‌లో ఉన్న 55 వేలు మంది కార్డుదారులకు 55 మెట్రిక్ టన్నులే సరఫరా చేయడం విమర్శలకు తావిస్తోంది.
పల్లె ప్రజలకూ ఇవ్వాలి
గోధుమ పిండి పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా మా లాంటి గ్రామీణ ప్రాంత పేదలకూ ఇవ్వాలి. పట్టణ ప్రజలు ఒక్కరికే ఇవ్వడం సరికాదు. మేము కూడా పేదవారమే కదా. మేము కూడా సంక్రాంతి పండగ చేసుకుంటామన్నది గుర్తించాలి.
– కరకనాయుడు, పెదవేమలి, లబ్ధిదారుడు
ఇది సరికాదు
గోధుమ పిండిని విజయనగరం పట్టణంలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడం తగదు. పల్లెల్లో నివసించే పేద ప్రజలకు కూడా ఇవ్వాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్డుదారులందరికీ పంపిణీ చేసేది. ఇప్పుడు పట్టణ ప్రజలకు మాత్రమే సరఫరా చేయడం ఎంతవరకు సమంజసం. తిరుగుబాటు తప్పదు.
– నారాయణమూర్తి,
లబ్ధిదారుడు, కోరుకొండపాలెం
పట్టణ లబ్ధిదారులకు మాత్రమే...
విజయనగరం పట్టణంలో ఉన్న కార్డుదారులకు గోధుమ పిండి ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. 55 మెట్రిక్ టన్నుల గోధుమపిండి వచ్చింది. కేజీ రూ.20 చొప్పన అందించనున్నాం.
– బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లై
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్డుదారులందరికీ గోధుమ పిండి సరఫరా చేసేంది. అది కూడా కేజీ రూ.16 చొప్పున అందజేసేది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కిలోకు రూ.4 అదనంగా పెంచి రూ.20కి కేవలం పట్టణ లబ్ధిదారులకే పంపిణీ చేస్తోంది. లబ్ధిదారులందరికీ రాయితీపై గోధుమ పిండి అందజేస్తే ఆర్థిక భారం అవుతుందన్న ఉద్దేశంతో కేవలం పట్టణ ప్రజలకు అందజేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వేళ పల్లెప్రజలపై వివక్ష చూపడాన్ని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ధర పెంచి విక్రయం..
● పట్టణాల్లోని రేషన్ లబ్ధిదారులకే గోధుమపిండి పంపిణీ ●
● పట్టణాల్లోని రేషన్ లబ్ధిదారులకే గోధుమపిండి పంపిణీ ●
● పట్టణాల్లోని రేషన్ లబ్ధిదారులకే గోధుమపిండి పంపిణీ ●


