గెస్ట్ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులకు గెస్ట్‌టీచర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాం, షికారుగంజి, బొక్కునాయుడుపేట మోడల్ స్కూల్స్‌లో ఎకనామిక్స్ పీజీటీ పోస్టు, తెర్లాం మోడల్ స్కూల్‌లో కామర్స్ పీజీటీ, గర్భాం మోడల్ స్కూల్ బోటనీ పీజీటీ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, బీఈడీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 4 తేదీలోగా దరఖాస్తులను ఆయా స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు అందజేయాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12,000 వేతనం ఇస్తారని పేర్కొన్నారు.
వృద్ధురాలి అన్నవాహికలో ఇరుక్కున్న ఎముక
● ఎండోస్కోప్ విధానంలో తొలగించిన జీజీహెచ్ వైద్యులు
విజయనగరం ఫోర్ట్: వృద్ధురాలి అన్నవాహికలో ఇరుక్కున్న చికెన్ బోన్‌ను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించినట్టు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ తెలిపారు. పి.అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు చికెన్ తింటుండుగా ఎముక అన్నవాహికలో ఇరుక్కుపోయింది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో శనివారం చూపించగా అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోప్ పరికరంతో ఎముకను విజయవంతంగా తొలగించారు. ఈఎన్‌టీ విభాగం హెచ్‌ఓడీ దక్షిణామూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్, మత్తు వైద్యులను సూపరింటెండెంట్ అభినందించారు.
త్వరితగతిన పరిష్కరించండి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ సమస్యలు, ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ల వారీగా సమస్యలపై సమీక్షించారు. వివిధ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇనాం భూములు, ఎస్టేట్ భూములు, పట్టాదారు పాసుపుస్తకాల జారీ, వెబ్‌ల్యాండ్ సమస్యలు, జాయింట్ ఎల్పీఎంలు, రీ సర్వే సమస్యలు, భూమి మ్యుటేషన్ సంబంధిత సమస్యలు, భూ రికార్డుల్లోని తప్పుల సవరణ వంటి అంశాల్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కలెక్టర్ సూచించారు. అందుబాటులో ఉన్న వివిధ రకాల మాస్టర్ రికార్డులను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఇ.మురళి, ఆర్డీఓలు డి.కీర్తి, సత్యవాణి, మోహనరావు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
లివిరిలో ఏనుగుల విధ్వంసం
భామిని: మండలంలోని లివిరిలో శుక్రవారం రాత్రి నాలుగు ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించాయి. రైతు సోమరాజు గోపాలరావుకు చెందిన కొబ్బరి చెట్లు, పామాయిల్ చెట్లను విరిచేశాయి. రైతు ఇంటి తలుపులు, అద్దాలు విరగ్గొట్టడంతో భయాందోళన చెందారు. ఏనుగులు ఇళ్లపై దాడిచేస్తున్నా అటవీశాఖ సిబ్బంది జాడలేదంటూ రైతు కుటుంబం వాపోయింది.
గెస్ట్ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం
గెస్ట్ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం


