ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు సస్పెన్షన్
● పట్టణంలో విద్యుత్ మీటర్లను తనిఖీ చేస్తున్న అధికారులు
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు బిల్ స్టాప్ మీటర్లను రూ.10 వేలు నుంచి రూ. 20 వేలుకు విక్రయిస్తున్నారన్న అంశంపై ‘బిల్‌స్టాప్ మీటర్ల తో ఖజానాకు గండి’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్‌శాఖ అధికారులు స్పందించారు. ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం నిజమేనని తేలడంతో కె.ఎల్.పురం జూనియర్ లైన్‌మన్ (జెఎల్‌ఎం) వి.దినేష్, దాసన్న పేటలైన్‌మన్ ఓ.రాంబాబును సస్పెండ్ చేస్తూ విద్యుత్‌శాఖ ఈఈ పి.త్రినాథరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పట్టణంలో విద్యుత్‌శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి మీటర్లు తనిఖీ చేస్తున్నారు. ఎన్ని బిల్‌స్టాప్ మీటర్లు మార్చారు అనేదానిపై విద్యుత్‌శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనతో పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ జిల్లాలో కూడా బిల్‌స్టాప్ మీటర్లు ఎక్కడైనా బిగించారా? అన్నది పరిశీలించాలని ఆ శాఖ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. విద్యుత్ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు.
ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు సస్పెన్షన్


