● యూరియా అందక ఆందోళన
రైతులందరికీ యూరియా అందజేయాలంటూ రేగిడి మండలం కందిశ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు. గ్రామంలోని ఆర్‌ఎస్‌కే వద్ద యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రైతుకు బస్తా చొప్పున కేవలం 350 బస్తాలే పంపిణీ చేయడం, సగం మంది రైతులకు యూరియా అందకపోవడంతో ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోశారు. యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ దుయబట్టారు. యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. – రేగిడి


