వికసిత్ భారత్‌లో శాస్త్రసాంకేతిక రంగాలే కీలకం
● జీఎంఆర్ ఐటీలో ప్రారంభమైన స్టెప్‌కాన్ సదస్సు
రాజాం సిటీ: వికసిత్ భారత్ లక్షసాధనలో శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ఎఫ్‌అండ్‌హెచ్ జీఓస్పెషియల్ ఇన్నోవేషన్ సెల్ సైంటిస్ట్ డాక్టర్ కొంగ గోపీకృష్ణ అన్నారు. టెక్నాలజీ అబివృద్ధిలో యువత ఆలోచనా విధానమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జీఎంఆర్ ఐటీలో స్టెప్‌కాన్–2026 సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కొత్తకొత్త ఆవిష్కరణలు ముఖ్యభూమిక పోషించనున్నాయని అన్నారు. 2047నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయాలజీ వంటి ప్రభుత్వ విభాగాలు, అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్, అలాగే బిల్డ్‌థాన్–2025, నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్కిల్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ పథకాలు శాస్త్రసాంకేతిక అభివృద్ధిలో తోడ్పడే విధానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ స్టార్టప్ ఐడియాలను తిలకించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, జీఏఆర్‌వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్ తదితరులు పాల్గొన్నారు.


