జాతీయ బాక్సింగ్ పోటీలకు విశ్వేశ్వరరావు
శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్‌మెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్‌ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్‌దేవ్, వంగా మహేష్ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్ బాక్సర్లు రాజీవ్, అప్పలరాజు, రాము, మనోజ్‌కుమార్ తదితరులు పేర్కొన్నారు.


