నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి
విజయనగరం క్రైమ్: కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ దామోదర్ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ బంగ్లాలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, డీటీసీ డీస్పీ పి.నారాయణ రావు, ఎఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, నగర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇతర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలో అందరికీ శుభాలు జరగాలని సూచించారు. పోలీస్‌శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రజలందరికీ మంచి సేవలందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


