మాయమైన డబ్బులు లభ్యం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామంలో సోమవారం పెన్షన్ డబ్బుల్లో రూ.50 వేలు మాయమైనట్లు పంచాయతీ కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే ఈ విషయమై సచివాలయ సిబ్బందిని పోలీసులు సోమవారం రాత్రి విచారణ చేశారు. మంగళవారం పెన్షన్ పంచేందుకు సచివాలయానికి చేరుకునే సరికి సచివాలయంలో రూ.50వేల నోట్ల కట్ట గమనించామని, ఈ నోట్ల కట్టను ఎవరో కిటికీలో నుంచి వేశారని, పోలీసుల సూచన మేరకు రాత్రి కిటికీ తెరిచి ఉంచామని కార్యదర్శి తెలిపారు.
10 ఇసుక లారీలు సీజ్
● అపరాధ రుసుం విధింపు
పూసపాటిరేగ: మండలంలోని కందివలస జంక్షన్ సమీపంలో జాతీయరహదారిపై అధిక లోడుతో వెళ్తున్న 10 ఇసుక లారీలను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సతీష్ బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వాహనాలను రవాణాశాఖ అధికారులకు అప్పగించగా రవాణాశాఖ అధికారి ఐశ్వర్యలక్ష్మి ఆ వాహనాలకు అపరాధ రుసుం విధించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న ఇసుక లారీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ అనుమతికి మించి అధిక లోడు వేసిన వాహనాలపై చర్యల కు ఉపక్రమిస్తామన్నారు. ఈ విషయాన్ని వా హనదారులు గమనించాలని సూచించారు.
మాయమైన డబ్బులు లభ్యం


