భూసార పరీక్ష కేంద్రం ఏడీగా శ్రీనివాస్
విజయనగరం ఫోర్ట్: భూసార పరీక్ష కేంద్రం (ఎస్‌టీఎల్) సహాయ సంచాలకులుగా గాలి శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించి వాటి ఫలితాలను సకాలంలో అందిస్తామని తెలిపారు. మట్టి పరీక్షల ఫలితాలు ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు.
డయాలసిస్ కేంద్రం తనిఖీ
విజయనగరం ఫోర్ట్: డయాలసిస్ సెంటర్‌లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే అంశంపై సాక్షిలో మంగళవారం కిడ్నీ రోగులపై నిర్లక్ష్యం..! అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ తుంపల్లి జనార్ధన్ డయాలసిస్ సెంటర్‌ను మంగళవారం తనిఖీ చేశారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చూడాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ స్పందిస్తూ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెన్షన్‌దారుల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికెట్ (జీవన ప్రమాణ పత్రం) సమర్పించేందుకు జిల్లా ట్రజరీ, సబ్ ట్రజరీ కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు విజయనగరం జిల్లా ఖజానా అధికారి వి.నాగమహేష్ మంగళవారం తెలిపారు. పెన్షన్‌దారుల సౌకర్యార్ధం ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు, కుటుంబ పెన్షన్‌దారులు 2026 సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా 2026 జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28 తేదీలోపు మాత్రమే సమర్పించవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 2025 మరియు డిసెంబర్ 2025 నెలల్లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026 సంవత్సరానికి చెల్లవని తెలిపారు. పెన్షన్‌దారుల సౌకర్యం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా ఖజానా, సహాయ ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో జీవన్ ప్రమణ్ పోర్టల్/యాప్ (జీవన్ ప్రమాణ్) ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు అవసరమైన పత్రాలలో పీపీఓ నెంబర్ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా సంఖ్య, మొబైల్ నెంబర్ (ఓటీపీ కోసం తప్పనిసరి) తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు.
అవగాహన ఒప్పందం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో బెంగళూరుకు చెందిన ఎంఈవో సార్ట్ ల్యాబ్, జేఎన్టీయూ జీవీల మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంతో జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు వీఎస్‌ఎల్‌ఐ చిప్ డిజైన్, సెమీ కండక్టర్ టెక్నాలజీలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్టు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమ – విశ్వవిద్యాలయ సహకారంతో శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు, సర్టిఫికేషన్ కోర్సులు, పరిశోధన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్ననారు. కార్యక్రమంలో విద్యార్థులు సెమీ కండక్టర్, వీఎన్‌ఎల్‌ఐ రంగాల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప కులపతి ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు, రిజిస్ట్రార్ జి.జయసుమ, ఎంవో సార్ట్ ల్యాబ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణకాంత్ అవలూరు, జెఎన్టీయూ జీవీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.చంద్రభూషణరావు, ప్రొఫెసర్ జి.స్వామినాయుడు, ప్రొఫెసర్ కె.బాబు, ప్రొఫెసర్ ఎస్‌కె.వలి, డాక్టర్ జి.జె.నాగరాజు, సీఈవో, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, విభాగాఽధిపతులు, ఎంవో సార్ట్ ల్యాబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
భూసార పరీక్ష కేంద్రం ఏడీగా శ్రీనివాస్
భూసార పరీక్ష కేంద్రం ఏడీగా శ్రీనివాస్


