విజయనగరం
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా ప్రజాఉద్యమం
● 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
● ప్రైవేటీకరణ ఆపాలంటూ రెవెన్యూ
అధికారులకు వినతులు
● చంద్రబాబు హయాంలో
ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యం
● ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఇబ్బందుల్లో పేద ప్రజలు
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
ఆరుగాలం కష్టించి, ఎకరాకు దాదాపుగా రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టి, మోంథా తుఫాన్‌లను సైతం తట్టుకుని అనేక అవస్థలు పడుతూ నిలబడిన అన్నదాతకు.. పంట చేతికందే వేళ కన్నీరే
మిగులుతోంది. –8లో
సందర్శనలు కాదు.. కొత్తగా ఏం చేశారో చెప్పండి
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలపెట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను సందర్శనల పేరిట హడావిడి చేయడం కాకుండా కొత్తగా ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని, ప్రహరీ నిర్మించి, 23 శాతం పనులు పూర్తిచేసిన విషయం ప్రజలకు తెలుసన్నారు. మోంథాతుఫాన్‌తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి నూర్పిడి చేస్తున్న ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.


