సీహెచ్‌సీకి రోగుల తాకిడి
బాడంగి: స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) రోగుల తాకిడి పెరిగింది. సుమారు 10 మంది డయేరియా రోగులు ఆస్పత్రిలో చేరి సేవలు పొందారు. సీహెచ్‌సీలో వసతి సదుపాయం లేకపోవడంతో కొన్నిబెడ్‌లపై ఇద్దరు రోగులను ఉంచి సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. నూతన భవనం నిర్మించినా అందుబాటులోకి తేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని రోగులతో పాటు వైద్యసిబ్బంది వాపోతున్నారు.
వద్దంటే సాగునీరు...
రైతు కంట కన్నీరు
సంతకవిటి: వరి పంట పండింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ దశలో సాగునీరు అవసరం ఉండదు. ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువలకు విడిచిపెట్టే నీటిని అమాంతం తగ్గించాలి. అయితే... మడ్డువలస అధికారుల నిర్లక్ష్యం వల్ల సంతకవిటి మండల పరిధిలోని సోమన్నపేట, శ్రీహరినాయుడుపేట, కృష్ణంవలస, మద్దూరుపేట, తదితర గ్రామాలకు సాగునీరు అందించే 24ఎల్ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోసిన వరి చేనును ముంచేస్తోంది. తక్షణమే షట్టర్‌ను సరిచేసి కాలువకు సాగునీరు విడుదల కాకుండా చూడాలని కోరుతున్నారు. దీనిపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ కాలువకు నీటిని నిలుపుదల చేస్తామన్నారు.
న్యాయం చేయండి
శృంగవరపుకోట: కోర్టు తీర్పు వచ్చేవరకు అన్ని పనులు నిలిపివేసి, జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బొడ్డవర వద్ద నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్, తదితరులు శనివారం సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జీఓ 14 రద్దు చేసి, భూ బదలాయింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పులు వచ్చేవరకు జిందాల్ భూముల్లో ఎలాంటి పనులు చేయకుండా ఆపాలన్నారు.
మరో ఇద్దరికి పచ్చకామెర్లు
సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్న బిడ్డిక లీలాసాయి, పాలక చరణ్‌కు పచ్చకామెర్లు సోకడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి వైద్యసేవలు అందించారు. వారు ప్రస్తుతం కోలుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు శని వారం వైద్య పరీక్షలు నిర్వహించగా మరో ఇద్దరికి పచ్చకామెర్ల సోకినట్టు నిర్ధారించారు. వీరిని మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు సీతంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.
సీహెచ్‌సీకి రోగుల తాకిడి


