మెంటాడను మన్యంలో కలపొద్దు
మెంటాడ మండలం తొలుత గజపతినగరం నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో సాలూరు నియోజకవర్గంలో కలిసింది. జిల్లాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూ రు నియోజకవర్గం ఉన్నందున మెంటాడను ఆ జిల్లాలో కలిపేందుకు జరుగుతున్న సన్నాహాలపై మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. మెంటాడకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉందని, వివిధ అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. విజయనగరంలోనే మెంటాడను కొనసాగించాలని కోరుతున్నారు. దీనికోసం మెంటాడ ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చేందుకు సిద్ధమవుతోంది. – మెంటాడ
విజయనగరంలోనే ఉంచాలి
జిల్లాల పునర్విభజన ప్రధాన ఉద్దేశం పాలనను చేరువ చేయడం. మెంటాడ మండలం విజయనగరం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే పార్వతీపురానికి అయితే 100 కిలోమీటర్లు. ఈ లెక్కన ఇప్పుడు ఉన్నట్టు విజయనగరం జిల్లాలోనే మెంటాడను కొనసాగించాలి. గత ప్రభుత్వం అన్నీ ఆలోచించే మెంటాడను విజయనగరంలో చేర్చింది.
– పీడిక రాజన్నదొర,
మాజీ ఉపముఖ్యమంత్రి
కలిసికట్టుగా అడ్డుకుంటాం
మెంటాడను మన్యం జిల్లాలో కలపకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులను కలుపుకుని పోరాటం సాగిస్తాం. అవసరమైతే దీక్షలు చేపడతాం. మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడమే సరైనది.
– రెడ్డి సన్యాసినాయుడు, ఎంపీపీ మెంటాడ
ప్రజాభిప్రాయం గౌరవించాలి
ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. మెంటాడను మన్యం కలపడం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. మండల ప్రజల అభిప్రాయం మేరకు విజయనగరంలోనే కొనసాగేలా చూడాలి. పొరపాటున మార్చితో పోరాటం సాగిస్తాం.
– ముగల లింగేశ్వరరావు,
విశ్రాంత ఉపాధ్యాయుడు
మార్పుచేయొద్దు
మెంటాడను పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చడం సరికాదు. ప్రజల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించాలి. ఆ మేరకు పునర్విభజన చేపట్టాలి. మన్యంలో చేర్చితే నష్టపోతాం. ఇబ్బందులు ఎదురవుతాయి.
– ఆర్.రామారావు, సర్పంచ్ ఇద్దనవలస, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు
మెంటాడను మన్యంలో కలపొద్దు
మెంటాడను మన్యంలో కలపొద్దు
మెంటాడను మన్యంలో కలపొద్దు
మెంటాడను మన్యంలో కలపొద్దు


