వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు 4వ తేదీకి వాయిదా
● మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న వైస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీలను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా వేసినట్లు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసినట్టు స్పష్టంచేశారు.
పారాది బ్రిడ్జివద్ద రాకపోకలు క్రమబద్ధీకరణ
బొబ్బిలిరూరల్: పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన కాజ్‌వే వరదనీటిలో మునిగిపోగా, పాత బ్రిడ్జిపై నుంచే బస్సులు, చిన్నచిన్న వాహనాలను విడిచిపెడుతున్నారు. ఆదివారం రాత్రి బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై మరమ్మతులకు గురై నిలిచిపోయిన లారీని క్రేన్ సహాయంతో పక్కకు పెట్టారు. బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలకు అనుమతించేదిలేదని సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు 4వ తేదీకి వాయిదా


