రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
విజయనగరం టౌన్: ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో నిర్వహించిన యోగా పోటీల్లో 18–14 సంవత్సరాల విభాగంలో జిల్లాకు చెందిన వై.దినేష్ కార్తికేయ రాష్ట్రంలో ప్రథమ స్ధానంలోను, 30–40 ఏళ్ల విభాగంలో శివకుమార్ ద్వితీయస్ధానం సంపాదించుకున్నారని, యోగా అసోసియేషన్ అధ్యక్ష్యుడు బూర్లె శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్ధాయిలో ప్రతిభ కనబర్చిన దినేష్, శివలు డిసెంబరు 27,28,29 తేదీల్లో గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించే జాతీయస్థాయి యోగాపోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా ఉపాధ్యాయులు, బి.సన్యాసిరావు, ఎన్.పైడిరాజు, ఎస్.రవివర్మ, సంతోష భారతిలు విజేతలకు అభినందనలు తెలిపారు.


