జూడో పోటీల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రజతం
● అభినందించిన ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ పోటీల్లో రజత పథకం సాధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బీఎస్‌ఎన్ మూర్తిని ఎస్పీ దామోదర్ సోమవారం అభినందించారు. ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన 10వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ 2025, 26 పోటీల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ రజత పతకం సాధించాడు. ఈ మేరకు తన చాంబర్‌కు మూర్తిని పిలిపించి ఎస్పీ మాట్లాడుతూ మూర్తి రజత పతకం సాధించి జిల్లాకు, పోలీస్ శాఖకు వన్నె తెచ్చారని ప్రశింసించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మూర్తిని ఎస్పీ అభినందించి, ఆయన క్రీడా ప్రతిభను ప్రశంసించారు. త్వరలో జీఎస్‌ఈ అందిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే తనకు పంపాలని ట్రాఫిక్ సీఐ సూరి నాయుడును ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు.


