వీడని గజరాజుల బెడద
కొమరాడ: ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి అటవీ శాఖ అధికారులు కదిలించరని, కూటమి ప్రభుత్వం కనీసం స్పందించంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట, ఆర్తాం అటవీప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు స్వామినాయుడువలస, కందివలస, గంగరేగువలస తదితర గ్రామాల్లో కూరగాయల సాగు ఉండడంతో రైతులు త్రీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చిన సమయంలో ఏ సమయంలో ఏనుగులు గుంపు వచ్చి ధ్వంసం చేస్తుందోసని ఈ ప్రాంత రైతులు భీతిల్లుతున్నారు. ఓ వైపు తుఫాన్, మరో వైపు ఏనుగుల సంచారంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. అలాగే వరిచేను కోతలు కావడంతో రైతుల పొలాల్లో ఏనుగులు సంచరిస్తే ఎక్కడ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుందో నని భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపును తరలించే చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అలాగే రైతులు పంట పొలాల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు.
వీడని గజరాజుల బెడద
వీడని గజరాజుల బెడద


