మోంథాపై అప్రమత్తం
నేటి రాత్రి నుంచి భారీ వర్షాలు
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు...
కంట్రోల్ రూంలు ఏర్పాటు
నేటి నుంచి మూడు రోజులు
విద్యా సంస్థలకు సెలవు
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూంలు
విజయనగరం అర్బన్: మోంథా తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దం అయింది. జిల్లా వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూంను ఆదివారం కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తుఫాన్ జాగ్రత్తలపై వివిధ శాఖ ల అధికారులతో సమీక్షించి తుఫాన్‌ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను మీడియాకు వివరించారు. మోంథా తుఫాన్ సోమ వారం సాయంత్రం తరువాత తీరం దాటే అవకా శం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. ఒక్కోసారి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశాలున్నాయని ప్రజలు అత్య వసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించా రు. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. పశువులను, పెంపుడు జంతువులను బయటకు విడిచిపెట్టవద్దని సూచించారు. నదు లు, గెడ్డలు, నీటి ప్రవాహాల్లోకి దిగవద్దని, వంతెన లు, కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తున్నపుడు వాటిపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించా రు. తాటాకు ఇళ్లు, పురిపాకల్లో ఉన్నవారిని రేపు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. మందులు, ఆహార పదార్ధాలతో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశా మని ఇప్పటికే మత్స్యకారులంతా ఒడ్డుకు చేరుకున్నారన్న సమాచారం వచ్చిందని కలెక్టర్ వివరించారు.
27 నుంచి 29వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు
మోంథా తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి డిగ్రీ కళాశాల వరకు అన్ని విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు పాటించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ ఏ యాజమాన్య విద్యా సంస్థ కూడా తెరవకూడదని హెచ్చరించారు. సంబంధిత విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అధికారులు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు మండల హెడ్ క్వార్టర్లలో ఉండి పూర్తి స్తాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకొని ప్రధానోపాధ్యాయులు సంబంధిత పాఠశాలల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యాశాఖ పరిధిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు 8978504260, 9441285224గా ఉన్నాయని తెలిపారు.
కలెక్టరేట్ : 08922–236947, 8523876706
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, విజయనగరం : 8885893515
ఆర్‌డీవో ఆఫీస్, చీపురుపల్లి : 9704995807
ఆర్‌డీవో ఆఫీస్, బొబ్బిలి : 9989369511
మున్సిపల్ కార్పొరేషన్, విజయనగరం : 9849906486
ఏపీ ఈపీడీసీఎల్ : 9490610102
ఏపీ ఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ : 1912
కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, మున్సిపాలిటీ లు, తహసీల్దార్ కార్యాలయాలు, విద్యుత్, అగ్నిమాపక శాఖల్లో 24/7 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుఫాన్ కంట్రోల్ రూంల ఫోన్ నెంబర్ వివరాలు ఇలా ఉన్నాయి.


