ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
మోంథా తుఫాన్‌పై జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
పార్టీ శ్రేణులంతా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలి
గంట్యాడ: గోస్తనీ నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని తాటిపూడిలో ఉన్న గొర్రి పాటి బుచ్చి అప్పారావు జలాశయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. వరద ఉధృతి గురించి జల వనరుల శాఖ ఏఈ శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. జలాశయం సాధారణ నీటి మ ట్టం, ప్రస్తుత నీటి మట్టం గురించి అడిగి తెలుసుకున్నారు. జలాశయం సాధారణ నీటి మట్టం 297 అడుగులని, ప్రస్తుత నీటి మట్టం 295.05 అడుగు లు ఉందని, వరద నీరు పెరుగుతున్నందున నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని ఏఈ జెడ్పీ చైర్మన్‌కు వివరించారు. దీనిపై జల వనరుల శాఖ ఈఈ వెంకటరమణతో ఫోన్‌లో మాట్లాడారు. నీటి ప్రవా హం అధికంగా ఉన్నందున జలాశయం కింద ఉన్న గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల్లోని గ్రామా ల ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో దండోరా, మైక్ ద్వారా తెలి యజేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పా టు చేయాలని అన్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశా ల మేరకు జలాశయాన్ని పరిశీలించినట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులంతా తుఫాన్ ముందస్తు చర్య లు, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట జెడ్పీటీసీ వర్రి నరసింహామూర్తి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పెంట శ్రీరాంపురం ఉప సర్పంచ్ కరక మహేష్ పాల్గొన్నారు.


