సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన సీతారాపు సతీష్(25) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తండ్రి సీరాపు శ్రీరాములు అందించిన వివరాలిలా ఉన్నాయి. కుమారుడు సతీష్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించిన కారణంగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగేశాడు. దీంతో చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు. సతీష్ సాలూరు ఆర్టీసీ డిపోలో కాట్రాక్ట్ పద్ధతిన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
యువకుడి ఆత్మహత్య
శృంగవరపుకోట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోకాడ బాపునాయుడు కొడుకు ప్రదీప్ కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నెట్‌వర్క్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గ్రామానికి వచ్చిన ప్రదీప్ అందరితో కలివిడిగా ఉన్నాడు. సోమవారం సాయంత్రం వరకు సన్నిహితులు, స్నేహితులతో సరదాగా గడిపి సోమవారం రాత్రి తన ఇంటి మేడపైన గదిలో చున్నీతో ఉరిపోసుకున్నాడు. ిస్థిరమైన ఉద్యోగం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. మృతుడు ప్రదీప్‌కు తండ్రి, తల్లితో పాటు పెళ్‌లైన అక్క ఉన్నారు.
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య