
యూరియా కోసం అవస్థలు
నెల్లిమర్ల రూరల్: యూరియా కోసం రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. మండలంలోని వల్లూరు, చంద్రంపేట రైతు సేవా కేంద్రాల వద్ద గురువారం అందిస్తామని అధికారులు సమాచారం ఇవ్వడంతో వేకువజాము నుంచే ఆయా కేంద్రాల వద్దకు రైతులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డారు. అయితే అక్కడకు వచ్చిన వారికి సరిపడా యూరియా బస్తాలు పంపిణీ చేయకపోవడంతో నిరాశ చెందారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రెండు నెలలుగా ఇన్ని బాధలు పడుతుంటే ప్రభుత్వానికి పట్టదా అని నిలదీస్తున్నారు. యూరియా వేసే సమయం దాటిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు.

యూరియా కోసం అవస్థలు