
● ఉచిత బస్సులో ఉక్కిరిబిక్కిరి
కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సదుపాయం నిరాశను మిగుల్చుతోంది. ప్రయాణికులకు సరిపడా బస్సులు వేయకపోవడం, కొన్ని సర్వీసుల్లోనే ఉచిత ప్రయాణ సేవలు అందించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బస్సు ఎక్కేందుకు సాధారణ ప్రయాణికులు భయపడుతున్నారు. ప్రతి ఉచిత బస్సు కిక్కిరిసిపోతోంది. బస్టాప్ వచ్చినా దిగేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. ప్రయాణికులకు సరిపడా బస్సులు వేయకుండా పథకం అమలుచేయడంపై మహిళలు విమర్శిస్తున్నారు. గజపతినగరం మండల కేంద్రంలోని వినాయక టెంపుల్ వద్ద ఉన్న బస్టాప్‌లో గంటల తరబడి నిరీక్షించినా బస్సుల్లో ఎక్కేందుకు చాలామంది ప్రయాణికులకు వీలుకాలేదు. దీనికి ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. – గజపతినగరం

● ఉచిత బస్సులో ఉక్కిరిబిక్కిరి