
బేస్‌బాల్ జాతీయ స్థాయి విజేతకు జేసీ అభినందనలు
విజయనగరం అర్బన్: కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన బేస్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పొలిపిరెడ్డి శ్రీనును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం అభినందించారు. పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని ప్రశంసించారు.
సిరిమాను చెట్టును దర్శించుకున్న అటవీశాఖ అధికారులు
విజయనగరం గంటస్తంభం: గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలోని పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్‌నరేష్ గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. పైడితల్లి జాతరను కొన్నేళ్లుగా రాష్ట్ర పండగగా ప్రభు త్వం నిర్వహిస్తోందని, అమ్మవారి దీవెనలు జిల్లా వాసులందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
గిరిజన యూనివర్సిటీలో ఉచిత వైద్య శిబిరం
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ ప్రారంభించి వైద్య సేవలు అందుకున్నారు. అనంతరం విద్యా ర్థులు, అధ్యాపకులకు గొట్లాం షాలోం ఆస్పత్రి వైద్యుడు అనిల్ బెంజిమెన్ సారథ్యంలో వైద్య బృందం వైద్య పరీక్షలు చేసింది. అవసరమైన మందులు అందజేసింది. ఆరోగ్య జాగ్రత్తలు వివరించింది. శిబిరంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, వర్సిటీ ఆర్థిక అధికారి పి.కె.దాస్, వైద్యులు విద్య, కుసుమ, కిశోర్ సేవలందించారు. 40 మంది బోధనేతర సిబ్బంది, 250 మంది విద్యార్థులు వైద్య సేవలు అందుకున్నారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: విజయనగరానికి చెందిన కృష్ణ హరీష్ ఈశ్వర అనే భక్తుడు గురువారం టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

బేస్‌బాల్ జాతీయ స్థాయి విజేతకు జేసీ అభినందనలు

బేస్‌బాల్ జాతీయ స్థాయి విజేతకు జేసీ అభినందనలు

బేస్‌బాల్ జాతీయ స్థాయి విజేతకు జేసీ అభినందనలు