
‘టోల్’ ఊరట..!
చికెన్
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ133 శ్రీ236 శ్రీ246
ఫెన్సింగ్ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలస సమీపంలో ఉన్న బడిదేవరమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు శనివారం మధ్యాహ్నం చెరువులో గల్లంతైన పాడి బంగారి దొర(45) మృతదేహం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో లభ్యమైంది. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. రెస్క్యూ బృందం సహాయంతో గాలించి జేసీబీ సాయంతో గట్టు తొలగించి నీరు మళ్లించిన అనంతరం బంగారి దొర మృతదేహం ఆచూకీ తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించామని చెప్పారు.
భోగాపురం: జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నాలుగు చక్రాల వాహనాలు సహా ఆపై పెద్ద వాహనాలు నడిపే వారంతా టోల్‌గేట్ దాటినప్పుడల్లా టోల్ చార్జీ చెల్లించకుండా ఉండేలా కొత్తగా టోల్‌పాస్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇదివరకు మనం వెళ్లే దారిలో ఎన్నిసార్లు మనం వాహనంతో టోల్‌గేటు దాటితే అన్నిసార్లు టోల్‌చార్జీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా రూ.3 వేలకు ఫాస్టాగ్ టోల్‌పాస్ జారీ చేస్తారు. దీంతో ఏడాది కాలం పాటు గానీ 200 ట్రిప్పుల వరకు గానీ టోల్‌గేటు గుండా ఫ్రీ(ఉచితం)గా ప్రయాణం చేయవచ్చు. వీటిలో ఏది ముందు అయిపోతే దానిని పరిగణనలోకి తీసుకుని, ఆ తర్వాత పాస్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా 1,087 టోల్‌గేట్లు
దేశవ్యాప్తంగా సుమారు 1,087 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. విజయనగరం జిల్లాలో నాతవలస, జొన్నాడ, గంట్యాడ, శ్రీకాకుళం జిల్లాలో చిలకలపాలెం, మండపం, తర్లువాడ, విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, అగన్‌పూడి వద్ద టోల్ గేట్లు కనిపిస్తాయి.
పాస్ పొందే విధానం
ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యాజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. బస్సులు, లారీలు, ట్యాక్సీలు, రవాణా వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్‌కు వినియోగించే కార్లకు, జీపులు, వ్యాన్‌లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పని చేస్తుంది.
డిజిటల్ రూపంలోనూ..
ఫాస్టాగ్ ఏడాది పాస్‌ను డిజిటల్‌గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్‌నుసెల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.3 వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్టులో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ3 వేలు చెల్లించిన తర్వాత ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రసుత్త ఫాస్టాగ్ ట్యాగ్‌కు లింక్ అవుతుంది.
గుమ్మలక్ష్మీపురం: అంతర్ జిల్లా ఫెన్సింగ్ పోటీల్లో మండలంలోని కన్నయ్యగూడకు చెందిన విద్యార్థినులు తోయక యమున, తోయక భానుమతిలు ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 30వ తేదీన భీమవరంలో జరిగిన 11వ క్యాడెట్ అండర్–17 అంతర్ జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని, ఇప్పీ టీమ్ విభాగంలో యమున వెండి పతకం, ఫోయిల్ టీమ్ విభాగంలో భానుమతి రజ త పతకం సాధించినట్లు కోచ్ బాలరాజు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఇరువురు బాలికలను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.
రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్ పాస్
ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు
చెల్లుబాటు
ఆగస్టు 15 నుంచి అమలులోకి..
సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న కేంద్రం
ట్రిప్పులు ఇలా లెక్కిస్తారు..
గతంలో మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు ఎన్నిచోట్ల టోల్‌గేట్లు వస్తే అన్నిచోట్లా టోల్‌చార్జీలు చెల్లించి, ముందుకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా వెళ్లేటప్పుడు ఒక్కో ట్రిప్పుకు ఇరువైపులా రూ.90 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ భారం లేకుండా ఎన్‌హెచ్(జాతీయ రహదారి) అధికారులు పాస్ విధానం అమలులోకి తెచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానం కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది. ఒకసారి రూ.3 వేలు పెట్టి పాస్ తీసుకుంటే సంవత్సరం వరకు లేదా 200 ట్రిప్పుల వరకు ఉచితంగా టోల్‌గేటు గుండా వెళ్లవచ్చు. అయితే ఒకసారి టోల్‌గేటు దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు.

‘టోల్’ ఊరట..!

‘టోల్’ ఊరట..!