
విజయనగరం
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
పరిష్కరించండి బాబూ...
●మా సమస్యలివి..
ఇలా వదిలి.. అలా నిలిపేసి..!
పెదంకలాం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసిన వెంటనే నిలిపివే యడంపై రైతులు మండిపడుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. –8లో
విజయనగరం కలెక్టరేట్ వివిధ వర్గాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో సోమవారం దద్దరిల్లింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ వర్గాల ప్రజలు అధికారులను వేడుకున్నారు. గోడును వినిపించారు. ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేశారు.
●30 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు సొంతభవనం లేదు.. పిల్లలకు బోధించేందుకు ఇద్ద రు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాలకు సెలవు తప్పడం లేదు. గత ప్రభుత్వం నాడు–నేడు కింద మంజూరు నిధులను వేరే పాఠశాల పనులకు మళ్లించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అధికారులు స్పందించి మా బడికి భవనం నిర్మించాలంటూ మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామస్తులు, పిల్లలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ప్లకార్డులతో తమ నిరసన గళం వినిపించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము, సహాయ కార్యదర్మి ఆర్. శిరీషతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ సేతమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు.
●బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కాకర్లవలస, కారేడువలస గ్రామాల గిరిజనుల సాగు భూములు లాక్కుని ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తే సహించబోమని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. ఆయా గ్రామాల గిరిజనులతో కలిసి ఆందోళన చేశారు. సాగు భూములు లాక్కోవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
●మున్సిపాలిటీల్లో ఆప్కాస్ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మరణించిన, రిటైర్ అయిన కార్మిక కుటుంబసభ్యులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. – విజయనగరం గంటస్తంభం
న్యూస్‌రీల్

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం