
వ్యాధులు ఉద్ధృతం
పారిశుద్ధ్యం అధ్వానం..
విజయనగరం:
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మా రింది విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. నగరంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. పన్నుల వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్న యంత్రాంగం ప్రజలకు అవస రమై న సేవలందించడంలో విఫలమవుతోంది. గడిచిన ఏడాది పాలనలో కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టిసారించేవారే కరువయ్యారు. వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు, కాలువలు శుభ్రం చేయడంలో అలస త్వం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై చూపుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే తోటపాలెం, పూల్‌బాగ్‌కాలనీ, వీటి అగ్రహారం ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి విష జ్వర కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలంటూ అధికారులు చేస్తున్న హడావిడి కేవలం ప్రకటనలకే పరిమితమ వుతోంది. దోమల నివారణ చర్యలు ఆశించిన స్థా యిలో జరగడం లేదు. నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వారానికి ఒకసారి ఫాగింగ్ చేపడుతున్నా కొద్ది రోజుల వ్యవధిలోనే పరిస్థితి యథాస్థితికి చేరుకుంటోంది.
పర్యవేక్షణ లోపం
నగర పరిధిని 245 పోకెట్లుగా విభజించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. 300 నుంచి 350 ఇళ్లను ఒక పోకెట్‌గా తీసుకున్నారు. ఒక్కోదానిలో 2.5 కార్మికులు ఉండాల్సి ఉంది. ఇక్కడ 800 మంది వర కు కార్మికుల అవసరం కాగా, ప్రస్తుతం 611 మంది ఉన్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పారిశు ధ్య సిబ్బందిలో కొందరు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ బదిలీ కార్మికులను నియమించుకుని వేరే కార్యకలాపాలు చూసుకుంటున్నారు. వచ్చిన బదిలీ కార్మికుడు తనకు తగ్గట్టుగానే పనులు చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇదే విషయమై కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్లు ప్రస్తావిస్తున్నా సమస్యలకు పరిష్కా రం లభించకపోవడం గమనార్హం. తాజాగా 45 మందిని ఒప్పంద ప్రాతిపదికన కార్మికులను తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదించినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
సమస్య తలెత్తితేనే...
నరగం విస్తరిస్తున్నా ఆ మేరకు సదుపాయాల కల్పనలో యంత్రాగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురిసి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తే తప్ప పూడికలు తొలగించాలన్న ధ్యాస కార్పొరేషన్ యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు కలగకపోవడం పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది సుమారు రూ.10 లక్షల ఖర్చుతో పలు ప్రధాన కాలువులను శుభ్రం చేసినట్టు అధికారులు చెబుతుండగా... మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కాలువల పరిస్థితి ఏమిటన్నది ప్రజల ప్రశ్న. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగడంలేదు. చిన్నపాటి వర్షానికి నగరంలో వరద నీరు పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
ప్రాంతం: విజయనగరం కార్పొరేషన్
విస్తీర్ణం : 51.62 చదరపు కిలోమీటర్లు
మొత్తం డివిజన్‌లు : 50
సచివాలయాలు : 61
నివాసాలు : 90 వేలు జనాభా: 3.04 లక్షలు
పారిశుద్ధ్య కార్మికుల లెక్కలు ఇలా...
కార్మికుల మంజూరు : 837
ప్రస్తుతం ఉన్న వారు : 609
పారిశుద్ధ్యపనులు కాకుండా
ఇతర విభాగాల్లో ఉన్న వారు : 100
బదిలీ వర్కర్లను
పెట్టుకున్న వారు : 100కు పైగానే
రోజూ శుభ్రం చేయాల్సిన
రోడ్ల పరిధి : 399 కిలోమీటర్లు
పూడికలు తీయాల్సిన
కాలువల విస్తీర్ణం : 466 కిలోమీటర్లు
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కాలువలను శుభ్రం చేయిస్తున్నాం. దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ సిద్ధం చేశాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశించాం.
– పల్లి నల్లనయ్య, కమిషనర్, విజయనగరం

వ్యాధులు ఉద్ధృతం

వ్యాధులు ఉద్ధృతం

వ్యాధులు ఉద్ధృతం

వ్యాధులు ఉద్ధృతం