
రైతుల పక్షానే ఉంటాం
శృంగవరపుకోట: వైఎస్సార్‌సీపీ పూర్తిగా రైతుల పక్షమని, సందేహాలకు తావులేదని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎస్.కోట లోని ఓ కల్యాణ మండపంలో పార్టీ నేతలతో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిందాల్ నిర్వాసిత రైతులకు అండగా ఉంటామని, వారి కుటుంబాల్లోని యువ తకు ఉపాధికల్పనే లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కు కు గత ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. అయితే, నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ముట్టలేదని, సాగులో ఉన్నవారికి సొమ్ములు అందలేదని, ఆర్‌ఎండ్‌ఆర్ ప్యాకేజీ అమలు కాలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, తాటిపూడి నీటి లభ్యతపై మరింత స్పష్టత కావాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తనతో పాటు అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తీసుకెళ్లారన్నా రు. ఈ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి రైతు లకు న్యాయం చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బొత్స చెప్పడంతో ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపన వాయిదా వేసినట్టు తెలిపారు. జిందాల్ రైతాంగ సమస్యలపై మాజీ మంత్రి బొత్సను కలవగా భూములిచ్చిన గ్రామాల్లో బాధిత రైతుల వివరాలు సేకరించాలని చెప్పారని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామన్నారు. జిల్లా మంత్రి ఎంఎస్‌ఎంఈ పార్కు ఆలోచన లేనప్పుడు తాటిపూడి నీటి ప్రస్తావన ఎందుకంటారు.. ఎమ్మెల్యే, కలెక్టర్లు ఎంఎస్‌ఎంఈని అడ్డుకోవద్దంటారు... మరో డీసీఎంఎస్ చైర్మన్ ఎక్కడి నుంచో యువకులను తెచ్చి కంపెనీ లు కావాలని ఉద్యమాలు చేయిస్తారు... పోలీసులు రైతులపై కేసులు పెడుతూ, సెక్షన్ 30 పక్కనపెట్టి ఒక వర్గానికి మద్దతిస్తారు... ఇన్ని గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని నిలదీశారు. రైతులకు న్యాయం చేసేందుకు జిందాల్‌తోనైనా, ప్రభుత్వంతో అయి నా పోరాటానికి సిద్ధమన్నారు. మాజీ ఎమ్మెల్యే హైమావతి మాట్లాడుతూ నాడు భూములిప్పించి రైతుల్ని మోసం చేసిన నేతలే నేడు మళ్లీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల్ని రోడ్డున పడేసి మంత్రి ఒక మాట, ఎమ్మెల్యే మరొక మాట చెప్పడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం చేస్తే ఏ పోరాటానికై నా సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మోపాడ కుమార్, జెడ్పీటీసీ మమ్ములూరి వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, వాకాడ రాంబాబు, షేక్ రహ్మాన్, సర్పంచ్ తగరంపూడి రమణ, పదాల ధర్మారావు, కె.అప్పయ్య, కె.జయశంకర్, ఎం.శంకర్, మజ్జి శేఖర్, జె.భాస్కర్‌రావు, కె.రంగా, అప్పల ఈశ్వరరావు, షేక్ స్వామి, యలమంచిలి అప్పారావు, వాకాడ సతీష్, రమేష్, చక్రి, పెంట గణేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
● మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు