
శ్మశాన వాటిక అభివృద్ధి నిధులను ఎలా మళ్లిస్తారు?
బొబ్బిలి: గత ప్రభుత్వం శ్మశాన వాటిక అభివృద్ధికోసం మంజూరు చేసిన రూ.10లక్షల నిధుల ను దారి మళ్లించడం ఎంతవరకు సబబని పలు ఎస్సీ కుటుంబాలు బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మిని నిలదీశారు. ఆ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని బొబ్బిలి పదో వార్డు గొల్లపల్లికి చెందిన తుట్ట తిరుపతి, రమ ణ, కూర్మారావు, రమేష్, డోల వెంకటరమణ తదితరులు కమిషనర్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వాసులు మాట్లాడుతూ శ్మశాన వాటిక లేదని అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్తే ఆయన స్థలాన్ని కేటాయించడంతోపాటు అభివృద్ధి కోసం రూ. 10లక్షలు మంజూరు చేయించారన్నారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, స్థానిక యువత, పెద్దలంతా కలిసి రూ.6 లక్షల సొంత నిధులతో కొంత అభివృద్ధి పనులు చేశామన్నా రు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇతర పనులకు కేటాయించిన విషయాన్ని తెలుసుకుని కమిషనర్‌కు వివరించామన్నారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలి
డెంకాడ: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో లేకుండా మంజూరు చేయాల ని ఆ శాఖాధికారులకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్ సూచించారు. డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద రూ.2,08 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 78వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఏడాదిలో జిల్లాలో 6 విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభించామని చెప్పారు. మరో 3 నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి సోలార్ విద్యుత్ యూని ట్లు లక్ష్యం కాగా రాష్ట్రానికి 20 లక్షలు కేటాయించ డం గర్వకారణమని తెలిపారు. తీరగ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నపంపై మంత్రి స్పష్టంచేశారు. కార్యక్రమంలో తూర్పుప్రాంద విద్యుత్ సంస్థ సీఎండీ పృద్విరాజ్ రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవులు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరా వు, ఈఈ జి.సురేష్‌బాబు, ఆర్డీఓ డి.కీర్తి, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు.