
ప్రత్యేక హోదా ఏదీ?
● ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ
విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకహోదా అడగకుండా రాష్ట్రానికి చెందిన కూట మి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ ఆరోపించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్రజలను మోసంచేశారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని, పార్టీ బలోపేతం కోసం బూత్‌లెవల్ కమిటీల ను నియమించాలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు.