విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Jul 28 2025 7:12 AM | Updated on Jul 28 2025 7:12 AM

విజయన

విజయనగరం

సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025
ఆరోగ్యశ్రీలో ప్రసవానికి..

పిల్లల్లో తగ్గుతున్న పెరుగుదల..!

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.

వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపానికి

గురవుతున్నారు. 8లో

ఆండ్ర రిజర్వాయర్‌ నుంచి

నీటి విడుదల

మెంటాడ: ఆండ్ర రిజర్వాయరు నుంచి సాగునీటిని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మ డి సంధ్యారాణి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడు తూ రిజర్వాయర్‌ మరమ్మతులకు రూ.2కోట్లు, ప్రాజెక్టు అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గుర్ల గెడ్డ, హైలెవల్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయిస్తామన్నారు. సూపర్‌ 6 హామీలు అమలు చేస్తామన్నారు. పథకాలు అమలు చేయడం లేదని గ్రామాల్లో తిరుగుతు న్న వైఎస్సార్‌సీపీ నాయకులను చొక్కాలు పట్టుకొని ప్రశ్నించండని రెచ్చగొట్టారు. నియోజకవర్గ పునర్విభజనలో మెంటాడ మండలం గజపతినగరంలోకి వస్తే పరవాలేదని, లేకుంటే పార్వతీపురం జిల్లాలో కలిపేలా చేస్తానన్నారు. ప్రాజెక్టు చైర్మన్‌ కోడి సతీష్‌, తహసీల్దార్‌ అరు ణకుమారి, ఎంపీడీవో భానుమూర్తి తదితరు లు పాల్గొన్నారు.

నేడు ప్రజా సమస్యల

పరిష్కార వేదిక

విజయనగరం అర్బన్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను డివిజన్‌, మండల, మున్సిపల్‌ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికను ‘మీ కోసం కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 1100’కు ప్రజలు ఎవరైనా సరే కాల్‌ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నా రు. అర్జీదారులు ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్‌’ వెబ్‌ సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు.

అందరి భాగస్వామ్యంతోనే

ఉత్తరాంధ్ర అభివృద్ధి

రాజాం సిటీ: వెనుబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ ఎ.అజశర్మ అన్నారు. స్థానిక ఓ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక డివిజన్‌ స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో ‘ఉత్తరాంధ్ర వెనుకబాటు–శాసీ్త్రయ పరిశీలన’ అనే అంశంపై ఆయన మాట్లాడా రు. ఉత్తరాంధ్రలో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్వహణ లోపం, అటవీ సంపద సద్వినియోగలోపం, అక్షరాస్యతలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండడం, సముద్రతీర సంపదను కార్పొరేట్‌ శక్తులు చేతిలోకి వెళ్లిపోవడం, పర్యావరణ పరిరక్షణ లోపం, జమిందారీ వ్యవస్థ వంటి అనేక కారణాల వలన ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబాటు తనానికి గురైందని అన్నారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యపరిచి భాగస్వాములుగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి వైపు తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిపారు. జేవీవీ అధ్యక్షుడు ఎంవీఎన్‌ వెంకటరావు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 13, 14తేదీల్లో విజయనగరంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ సభ్యులు జె. నీలయ్య, మక్క అప్పలనాయుడు, గట్టి పాపారావు పాల్గొన్నారు.

విజయనగరం పట్టణానికి చెందిన సంధ్య అనే గర్భిణి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రసవం చేయించుకోవాలని

కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన రెండు రోజుల ముందే అన్ని రకాల వైద్య పరీక్షలు, స్కాన్‌ తీయించుకున్నారు. అయినప్పటికీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి వైద్యురాలు తమ

ఆసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు, తాము సూచించిన స్కానింగ్‌ సెంటర్‌లో స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పింది. అలా అయితేనే తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కాన్పు జరిపిస్తామని చెప్పడంతో గత్యంతరం లేక మళ్లీ వైద్య

పరీక్షలు చేసుకున్నారు. ఇందుకోసం రూ.3 వేలు వరకు వెచ్చించారు.

విజయనగరం ఫోర్ట్‌:

జిల్లాలో అనేక మంది గర్భిణులకు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ఉచితంగా ప్రసవం జరిపించుకోవ చ్చు అని గర్భిణులు భావిస్తారు. అయితే కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు పెట్టిన నిబంధనల వల్ల గర్భిణులకు చేతిచమురు వదులుతుంది. అందులోనూ రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. నిరుపేద గర్భిణుల కు ఇది అదనపు భారం అయినప్పటకీ తప్పని పరిస్థితి.

అవస్థలు పడుతున్న గర్బిణులు

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గర్భిణులు ప్రసవం జరిపించుకోవాలంటే 3వ నెల, 6వ నెల, 9వ నెలల్లో చేయించుకున్న మెడికల్‌ రిపోర్ట్స్‌, స్కానింగ్‌ రిపో ర్టులు, టిఫా స్కాన్‌ రిపోర్టులు ఉండాలి. అయితే గర్భిణులు ఈ రిపోర్టులు అదే ఆసుపత్రుల్లో చేయించుకున్న రిపోర్టులై ఉండాలని వైద్యులు నిబంధన పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోగాని, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్య పరీక్షలు, స్కానింగ్‌ రిపోర్టులు ఉన్నా అవి పనికిరావని తెగేసే చెప్పేస్తున్నారు. అంతేకాకుండా నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో ఒక టి రెండు రోజులు ముందు చేయించిన రిపోర్టులు కూడా పనికిరావని చెప్పడం గమనార్హం. అన్నింటి కంటే ముఖ్యంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రి వారు చెప్పిన స్కానింగ్‌ సెంటర్‌కు సంబంధించిన రిపోర్టు ఉన్నప్పటకీ వారి లెటర్‌ హెడ్‌పై రాసిచ్చి మళ్లీ స్కానింగ్‌ తీయించుకోమంటున్నారు. ఇదంతా స్కానింగ్‌ కేంద్రాల వారు ఇచ్చే కమిషన్‌ల కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌

ఆసుపత్రులు

జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అభినవ్‌ ఆసుప త్రి, కొలపర్తి, సాయి పీవీఆర్‌, సాయి సూపర్‌ స్పె షాలిటీ, వెంకటరామ, ఆంధ్ర, మారుతి, పీజీ స్టా ర్‌,స్వామి ఐ ఆసుపత్రులు ఉన్నాయి. వీటితో పాటు నెప్రోఫ్లస్‌ ఆసుపత్రి, మిమ్స్‌, మువ్వ గోపాల, కాస్వి, క్వీన్స్‌ ఎన్‌ఆర్‌ఐ, గాయిత్రి, పుష్పగిరి, తిరుమల మెడికవర్‌, శ్రీనివాస్‌ నర్సింగ్‌ హోమ్‌, పిలిడోపియా ఆసుపత్రి, అమృత, సంజీవిని, శ్రీ బాపుజీ, సంజీవిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, సాయికృష్ణ, విజయ మల్టీ స్పెషాలిటీ, వెంకట పద్మ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్రసవాలు చేయించుకోవచ్చు.

ఏడాదిలో 20 వేల వరకు ప్రసవాలు

జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11 వేల వరకు జరగగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9 వేలు వరకు జరుగుతున్నాయి. అధిక శాతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ప్రసవాలు జరుగుతున్నాయి.

న్యూస్‌రీల్‌

వైద్య పరీక్షలన్నీ చేసుకున్నా..

మళ్లీ చేసుకోవాలని నిబంధన

పెడుతున్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులు

ఫలితంగా గర్భిణులకు చేతి చమురు వదులుతున్న వైనం

వైద్య పరీక్షలు, స్కానింగ్‌ కోసం

రూ.వేలల్లో ఖర్చు

జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు

జిల్లాలో 26 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు

సరికాదు..

వైద్య పరీక్షలు, స్కానింగ్‌ రిపోర్టులు ప్రసవం జరిగే నెలలోవే అయితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. మళ్లీ వైద్య పరీక్షలు, స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పడం సరికాదు. అటు వంటి ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆసుపత్రిపై ఫిర్యా దు చేస్తే వారు ప్రసవం జరిపిస్తారో.. లేదోనని.. భయం వద్దు. అదే ఆసుపత్రిలో ప్రసవం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ కుప్పిలి సాయిరాం,

ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌

విజయనగరం1
1/4

విజయనగరం

విజయనగరం2
2/4

విజయనగరం

విజయనగరం3
3/4

విజయనగరం

విజయనగరం4
4/4

విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement