
జిందాల్ తెచ్చిన తంటా..
శృంగవరపుకోట:
జిందాల్ నిర్వాసితుల సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఎంపీడీవోకు సస్పెన్షన్ హెచ్చరికకు దారితీసింది. దీంతో చేసేది లేక సమావేశం మధ్యలోనే నిలిపేసి ప్రజా సంఘాల నేతలు కార్యాలయం విడిచి వెళ్లారు. తరువాత కార్యాలయం బయట నిరసన తెలిపారు. తాను దళితుడిని కావడం వల్లే పై అధికారులు చిన్నచూ పు చూస్తున్నారని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిందాల్ నిర్వాసితుల సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు రైతు సంఘాల నేతలు సిద్ధమయ్యారు. సమావేశ నిర్వహణకు ఎంపీడీవో అభ్యంతరం చెప్పడంతో ఎంపీపీ చాంబర్‌లో ఎంపీపీ సోమేశ్వరరావు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఎంపీడీవో సతీష్ వచ్చి ‘జిందాల్‌కు సంబంధించి చర్చలు, సమావేశాలు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం సరికాదంటున్నారు.. మీరు ఖాళీ చేసి వెళ్లకుంటే నన్ను సస్పెండ్ చేస్తానంటున్నారు.. సార్’ అంటూ ఎంపీపీకి తన గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఎంపీపీ మాట్లాడుతూ తాను ఇక్కడి వాడినని.. నిర్వాసితుల ప్రాంతం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీ అయ్యాను.. వాళ్ల సమస్యలపై నా చాంబర్‌లో మాట్లాడకూడదా... అంటూ అడిగారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. జిల్లా అధికారులు అంగీకరించ డం లేదు సార్.. అని చెప్పడంతో ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఎంపీపీ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. ఎంపీడీవో కార్యాలయం బయ ట ప్రజా సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడా... మాట్లాడనివ్వరు... సమస్య చెప్పనివ్వరు.. ఇదేమి నియంతృత్వ పాలన అంటూ నిరసన తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణ ఖాళీ చేయాలని బతిమలాడడంతో అంతా కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు, న్యాయవాది బి.రామకృష్ణ, వేదిక వ్యవస్థాపకుడు డి.సూర్యారావు, చల్లా జగన్, పదాల మణిబాబు, మద్ది కృష్ణ, వర్మరాజు తదితరులు మాట్లాడుతూ జిందాల్ తీరును, వెనకేసుకొస్తున్న అధికారుల తీరును తప్పుబట్టారు. నిర్వాసితుల పోరాటానికి తమ సంఘీభావం తెలిపారు.
దళితుడిని కావడం వల్లే..
ఎంపీపీ సోమేశ్వరరావు విలేకరులతో మాట్లాడా రు. తాను దళితుడిని కావడం వల్లే నాకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కుల్లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ అన్న గౌరవం లేకుండా చేశారు. తన చాంబర్‌లో నా ప్రాంతానికి చెందిన నాయకులతో మాట్లాడకూడదా.. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వాళ్లతో కూర్చోకూడదట.. ఇదేమి అన్యాయం అంటూ ప్రశ్నించారు. తాను సమావేశం ఆపకపోతే ఎంపీడీవోని సస్పెండ్ చేస్తానంటూ కలెక్టర్ బెదిరించడం అన్యాయం కా దా.. ఇదేనా.. సామాజిక న్యాయం అంటూ ప్రశ్ని ంచారు.
ఎంపీడీవోకు సస్పెన్షన్ హెచ్చరిక
దళితుడిననే చిన్న చూపు : ఎంపీపీ