
సంతృప్తికర సేవలందించా..
విజయనగరం అర్బన్: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సిఫార్సులతో సంతృప్తికర సేవలందించినట్టు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. ఈ నెల 27వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జెడ్పీ అతిథిగృహంలో మీడియాతో శనివారం మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాజ్యాంగపరమైన బాధ్యతగల ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి అప్పగించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల పదవీ కాలంలో ఆదివాసీల వివిధ స్థాయిలోని సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేసినట్టు చెప్పారు. గిరిశిఖర గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నించామన్నారు. ఆదివాసీల నుంచి ఏ సమయంలో, ఏ రూపంలో వినతులు వచ్చినా స్వీకరించేవాడినని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న వెట్టిచాకిరీపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించి దానిని నిర్మూలించేందుకు కృషి చేశామన్నారు. మైదాన ప్రాంతంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కమిషన్ పనిచేసిందని వివరించారు. ఎస్టీ కమిషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన ముఖ్యమైన సిఫార్సులను ప్రకటించారు.
● నేటితో ముగియనున్న చైర్మన్ పదవీ కాలం●
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ
శంకరరావు

సంతృప్తికర సేవలందించా..

సంతృప్తికర సేవలందించా..