
మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
చీపురుపల్లి: ప్రజలను మోసం, దగా చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, నిమ్మలవలస గ్రామాల్లో శనివారం సాయంత్రం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమ్మలవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎన్నో హామీలిచ్చి ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. ఆడబిడ్డ నిధి పథ కాన్ని అమలు చేయాలంటే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ను అమ్మే యాలని చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో లంచాలు వ్యవస్థ పెరిగిపోయిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసాలను నమ్మరాదని చెప్పారు. అంతకుముందు దేవరపొదిలాం, నిమ్మలవలస గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండల నాయకులు ఇంటింటికీ తిరిగి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనా యుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మేధావి వర్గం అధ్యక్షుడు ఎంవీఎస్‌ఎన్ రాజు, గవిడి సురేష్, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అధికార్ల శ్రీనుబాబు, చింతాడ లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ ‘బెల్లాన’

మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య