
విద్యుత్ సబ్ స్టేషన్ వాచ్‌మన్ అదృశ్యం
విజయనగరం క్రైమ్: దాసన్నపేట విద్యుత్ సబ్ స్టేషన్ లో వాచ్ మన్‌గా పని చేస్తున్న కె.రమణయ్య కనిపించడం లేదని ఆయన భార్య సత్యవతి శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రమణయ్య జీతం వచ్చినప్పుడు ఇంట్లో కాస్త ఇచ్చి ఊరెళ్తున్నానని భార్యకు చెప్పేవాడు. అయితే గడిచిన నాలుగు నెలల నుంచి భర్త ఇంటికి రాకపోవడంతో స్థానికులు, బంధువుల ఇళ్లకు వెళ్లి భార్య సంప్రదించింది. ఏపీ ట్రాన్స్ కో సిబ్బంది కూడా వాచ్‌మన్ రమణయ్య గురించి వాకబు చేసి..డ్యూటీకి రావడం లేదని భార్యకు చెప్పారు. దీంతో ఆమె తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కనకరాజు వివరించారు.