చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

Jul 26 2025 9:36 AM | Updated on Jul 26 2025 10:14 AM

చికెన

చికెన్‌

బ్రాయిలర్‌ లైవ్‌ డెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ107 శ్రీ184 శ్రీ194

లింగ నిర్ధారణ వెల్లడిస్తే చర్యలు

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: లింగ నిర్ధారణ వెల్లడించే స్కానింగ్‌ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్బస్థ, పిండ పక్రియ 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి, ఉప జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోగ్రాం అధికారులు వారి పరిధిలో ఉన్న స్కానింగ్‌ సెంటర్స్‌ను పరిశీలించాలని ఆదేశించారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్‌ రెడ్డి అచ్యుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ ఆధ్వర్యంలో

‘పోలీస్‌ వెల్ఫేర్‌ డే’

విజయనగరం క్రైమ్‌: జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్‌ జిందల్‌ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పోలీసు వెల్ఫేర్‌ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ‘పోలీసు వెల్ఫేర్‌ డే’లో భాగంగా సిబ్బంది ఒక్కొక్కరిని ఎస్పీ వకుల్‌ జిందల్‌ తన చాంబర్‌లోకి పిలిపించుకుని వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

రేగిడి: మండలంలోని ఉంగరాడమెట్ట సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితంలేని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనను చూసిన పోలీసులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్‌ గంగు జగన్నాథరావులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. పూర్తిగా బురద, రక్తంతో తడిచిపోయిన క్షతగాత్రుడిని పోలీసుల సహాయంతో శుభ్రం చేయడంతో పాటు కొత్త దుస్తులు వేసి రాజాం సామాజిక ఆస్పత్రికి మెరుగైన చికిత్సనిమిత్తం తరలించారు. మానవత్వంతో 108 సిబ్బంది అందించిన సేవలను పలువురు అభినందించారు.

బాగెంపేటలో చోరీ

వంగర: మండల పరిధిలోని బాగెంపేట గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శంకరరావు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. ఈ విషయం గమనించిన దొంగలు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను తెరిచారు. ఈ విషయం శుక్రవారం ఉదయం గమనించిన చుక్కపక్కల వారు ఇంటి యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జి ఎస్సై పి.నీలావతి, క్లూస్‌టీం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం బృందం పలుచోట్ల వేలిముద్రలు సేకరించింది. ఈ విషయంపై వంగర పోలీసులను సంప్రదించగా హైదరాబాద్‌ నుంచి ఇంటి యజమాని ఫ్‌లైట్‌లో వస్తున్నాడని, ఆయనను ఫోన్‌లో సంప్రదించగా సుమారు 20తులాల బంగారం పోయినట్లు తెలిపాడన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు వచ్చి పరిశీలించిన తరువాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేస్తామని ఎస్సై తెలిపారు.

చికెన్‌1
1/3

చికెన్‌

చికెన్‌2
2/3

చికెన్‌

చికెన్‌3
3/3

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement