
రామతీర్థానికి శ్రావణ శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి శ్రావణమాస శోభ సంతరించుకుంది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఉమా సదాశివాలయంలో ఉన్న కామాక్షి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. మహాలక్ష్మి అమ్మవారిని చందనంతోను, కామాక్షి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. తొలి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు.
వైభవంగా పూర్ణాహుతి
రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామిని ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన అనంతరం యాగశాలలో పూర్ణాహుతి చేపట్టారు. తరువాత వెండి మంటపంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

రామతీర్థానికి శ్రావణ శోభ

రామతీర్థానికి శ్రావణ శోభ