
పాత పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు
విజయనగరం అర్బన్: వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డులకు పంపిణీ చేసిన పట్టాదారుల పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన పుస్తకాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెండు విడతల్లో దాదాపు 360 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పలు గ్రామాల్లో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు రీసర్వే ప్రక్రియపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అపోహలు కల్పించిన కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే విధానాన్నే అవలంబిస్తున్న విషయాన్ని కప్పిపుచ్పుకోవడానికి ఇప్పటికే పూర్తయిన రీసర్వే గ్రామాల్లో కాలయాపన చేయడం కోసం మరోసారి రీసర్వే చేపట్టింది. గత ప్రభుత్వం పూర్తి చేసిన రీసర్వేలను సరిచూసుకోవడం మినహా కొత్త గ్రామాల రీసర్వే మూడో విడత పనులు జరగలేదు.
ఆగస్టు 15న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
భూ హక్కుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందని, ఇటీవల సవరించిన రీసర్వే పనులు పూర్తయిన అన్ని గ్రామాలకు సంబంధించి భూహక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయని విజయనగరం ఆర్‌డీఓ దాట్ల కీర్తి శుక్రవారంతెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తొలి విడతగా విజయనగరం డివిజన్ పరిఽధిలోని 39 గ్రామలకు చెందిన భూహక్కుదారులకు వచ్చే నెల 15న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనునున్నామని, వాటికి సంబంధించి ఇప్పటికే రీసర్వే సవరణ ప్రక్రియ పూర్తయిందని, వెబ్‌ల్యాండ్‌లో సమాచారం ఆధారంగా సరిపోయిన వారికి పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విజయనగరం డివిజన్ పరిధిలో ఇళ్ల పథకం కింద 11 వేల మంది దరఖాస్తు చేసుకోగా వాటిని 30 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన పట్టాలపై మరో సారి సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇంటి స్థలం లేనివారు, లబ్ధిదారు కుటుంబంలో ఏ ఒక్కరూ గతంలో ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల ద్వారా లబ్ధిపొందని మహిళలు అర్హులవుతారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న గృహాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 175 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఆగస్టు 15న కొత్త పుస్తకాల పంపిణీ