
డిసెంబర్ లోగా ఇళ్లనిర్మాణం పూర్తిచేయాలి
విజయనగరం టౌన్: ప్రభుత్వం ఇచ్చిన స్ధలాల్లో ఇళ్ల నిర్మాణాలను సగంలో ఆపేసిన వారంతా డిసెంబర్ నెల లోగా పూర్తిచేయాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (అడ్మిన్), విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రత్యేకాధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గుంకలాం జగనన్న లేఅవుట్‌ను ఆయన డీఈ రంగారావుతో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో త్వరితగతిన రూప్‌కాస్ట్ నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 2091 ఇళ్లు రూఫ్ లెవల్స్ వరకూ వచ్చాయని, నాలుగు వారాల్లో వాటిని పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. వాటిలో సుమారు 1161 మంది లబ్దిదారులకు అదనపు బెనిఫిట్స్ అందజేశామని తెలిపారు. బీసీలకు రూ.50వేలు, ఎస్సీలకు రూ.75వేలు, ప్రిమిటెవ్ ట్రయ్ గ్రూప్స్‌కు రూ.లక్ష అందజేశామని చెప్పారు. మిగతా వారెవరికై నా డబ్బులు రాలేదని ముందుకువస్తే హౌసింగ్ అధికారులతో కలిసి వారికి సాయమందిస్తామని చెప్పారు. 1500 వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడం టార్గెట్‌గా ఉంచామని, లబ్ధి డిసెంబరు నెలాఖరువరకే ఉందన్నారు. డిసెంబరు లోపు ఇళ్లు కట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అందవన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న కాంట్రాక్టర్‌లు కట్టిస్తున్న ఇళ్లపై ఆన్‌లైన్ వర్క్ చేసేందుకు ఎమినిటీస్ ఇక్కడికి రావడం లేదని. కచ్చితంగా వారు కనీసం వారానికి రెండుసార్లు అయినా వచ్చి ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెట్టాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.