
ఇన్‌స్పైర్ మనక్ అవార్డు కోసం నామినేషన్ల ప్రక్రియ
పార్వతీపురం టౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి ఇన్‌స్పైర్ మనక్ అవార్డు కోసం ప్రాజెక్ట్‌ల నామినేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో మొదలైందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యా శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీలోగా అన్ని పాఠశాలల నుంచి ప్రాజెక్టు సబ్‌మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులను ఆదేశించామన్నారు. ప్రతి మండల పరిధిలో ఉండే అన్ని పాఠశాలల నుంచి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నామినేట్ అయ్యే విధంగా చూడాలని మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 6–12 తరగతులకు ఇన్‌స్పైర్ మనక్‌లో అవకాశం కల్పించారని తెలిపారు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్స్ హైస్కూల్ ప్లస్ నుంచి 7 ప్రాజెక్ట్స్ httpr://www.inspireawards&drt.gov.in అనే లింక్ ఓపెన్ చేసి ప్రాజెక్టు సబ్‌మిట్ చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ సబ్మిషన్, ఇతర సాంకేతిక సహకారానికి జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు ఫోన్ నంబర్ 8978077156ను సంప్రదించవచ్చని కోరారు.