
జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
బొబ్బిలి: సీపీఐ 14వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మిరమణ కోరారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహాసభల సభా ప్రాంగణం ఏర్పాట్లను ఆయన కార్యవర్గంతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్యలు హాజరవుతారన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ