
● మూతపడిన మరో బడి
విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మూతపడగా, తాజాగా దత్తిరాజేరు మండలం వంగర పంచాయతీ మధుర గ్రామమైన ముద్దానపేట ప్రాథమిక పాఠశాలకు తాళంపడింది. సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో గతేడాది వరకు ఇద్దరు విద్యార్థులు (3వ తరగతి, ఒకటో తరగతి) చదివేవారు. వారు కూడా మూడురోజుల కిందట టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో పాఠవాలకు తాళం వేసినట్టు ఎంఈఓ–2 సుధాకర్ తెలిపారు. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడిని ఎమ్మార్సీకి పంపించామని, ఉపాధ్యాయులు సెలవు పెట్టిన చోట ఆయనను బోధనకు పంపిస్తామన్నారు. – దత్తిరాజేరు