
పీ 4 పేరుతో ‘సంక్షేమం’ కట్
పేదల్ని సంపన్నుల్ని చేస్తానంటే అమాయకులైన పేదలు నమ్మి ఐదేళ్లుగా సంక్షేమ పథకాలిచ్చి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపరిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాకుండా చంద్రబాబును గెలిపించారు. మహిళా లోకానికి ‘ఆడబిడ్డ నిధి’ని ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకూ నెలకు రూ.1,500 ఇస్తామనడం నుంచి 50 ఏళ్ల మహిళలకు పింఛన్, నిరుద్యోగ భృతి, పొదుపు సంఘాల ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలను ఈ పీ–4 కార్యక్రమానికి జోడించినట్టు చంద్రబాబు ప్రకటించారు. సంపన్నులను చేయడం అంటే ఉన్న సంక్షేమ పథకాలను కత్తిరించి సంపన్నుల మోచేతి కింద బతకడం అని నిరుపేదలకు స్పష్టత ఏర్పడింది. దీంతో ప్రజల నుంచి క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది.