
ఆదర్శ పాఠశాలలో పురుగుల బియ్యం మార్పు
దత్తిరాజేరు: మండలంలోని షికారుగంజి ఆదర్శ పాఠశాలకు వచ్చిన పురుగుల బియ్యంపై బుధవారం సాక్షిలో వచ్చిన కథనంపై పౌర సరపరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శాంతి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మహేష్ వచ్చి బియ్యాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే బియ్యాన్ని వ్యాన్‌లోకి ఎక్కించి కొత్తగా 25 కేజీల బియ్యం ప్యాకెట్లను 32 బస్తాలను ప్రిన్స్‌పాల్ ఈశ్వరావుకు అందజేశారు. ఇలాంటి పొరప్లాట్లు ఇంకెక్కడా జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించనున్నట్లు ఆయన సాక్షితో అన్నారు.పత్రికలో వచ్చిన కథనంతో పురుగుల బియ్యం మార్చి మంచి బియ్యం పాఠశాలకు అందజేయడంతో విద్యార్థులు, తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదర్శ పాఠశాలలో పురుగుల బియ్యం మార్పు