
పెంచిన సినిమా టికెట్ ధరలు తగ్గించాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం హర హర వీరమల్లు సినిమా కోసం టికెట్ ధరలు పెంచుతూ తీసుకున్న ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సామాన్యులకు అన్నింటా అధిక ధరల పెంపుతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం చివరికి వినోదం కోసం సినిమా వీక్షించేందుకు థియేటర్లకు వెళ్లినా వదలడం లేదన్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు బెనిఫిట్ షో పేరుతో రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేయడం దారుణమన్నారు. బెనిఫిట్ షో పేరుతో ప్రేక్షకులను దోపిడీ చేసే విధానాన్ని అదుపు చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న